మాజీ పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము…!!!
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా ఫిబ్రవరి 07 :
శుక్రవారం వనపర్తి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నూతనంగా రెండవసారి ఎన్నికైన డి నారాయణకి వనపర్తి పట్టణ మాజీ బిజెపి పట్టణ అధ్యక్షడు బచ్చు రాము బిజెపి మాజీ సర్పంచ్ దేవేందర్ నాయుడు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. బచ్చు రాము మాట్లాడుతూ వనపర్తి లో వాడు కౌన్సిలర్ చైర్మన్ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ పార్టీని బలోపేతం చేయాలని బిజెపిపార్టీకి ఎప్పటికీ మా వంతు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలపడం జరిగింది. నరేంద్ర మోడీ కార్యక్రమాలు వారి యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకువెళ్లాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు, తిరుమలేష్, జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు కుమారస్వామి, పీఎం రాము,వనపర్తి ఉపాధ్యక్షులు బిజెపి దళిత మోర్చా అధ్యక్షుడు చాణిక్య,అంజి వసంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





