నేటిసాక్షి, గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్):
సమగ్ర సర్వే పేరుతో బీసీ లను గొంతు కోస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నాయకుడు నూకల చింటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు .కుల గణన పేరిట 50 రోజులపాటు సర్వే పేరిట చేసిన ఆధారాలు కరెక్టుగా లేవని బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీలను తక్కువ శాతంతో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడక అని విమర్శించారు. బీసీలపై సీఎం కపట ప్రేమ ఒలకపోస్తున్నారని ఎద్దేవా చేశారు. బీసీలను రాజకీయంగా అనగా తొక్కేందుకే సర్వేలో శాతాన్ని తక్కువ చేసి చూపించారని నూకల చింటూ ఆరోపించారు.





