నేటి సాక్షి, బెజ్జంకి: మండలంలోని చీలాపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు శుక్రవారం రోజు ₹25 వేల విలువైన వాటర్ ప్యూరిఫైయర్ మెషిన్ విరాళంగా అందజేశారు. 2008-2009 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు పైడి నాగరాజు, ఎండి అజారుద్దీన్, పంతం మనోజ్, బండిపెల్లి ప్రవీణ్, శ్రీరాముల హరీష్ కలిసి విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రామంచ రవీందర్, మాజీ సర్పంచ్ రావుల మొండయ్య, ఎర్రవెల్లి శ్రీనివాస్, పవ్వడి మల్లికార్జున్, శానకొండ శరత్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.





