Wednesday, March 18, 2026

మాకు 11శాతం వాటా రావాలి

  • ప్రభుత్వం 9 శాతమే ప్రతిపాదించింది
  • ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై మంద కృష్ణ మాదిగ

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యా యం జరిగిందని ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరో పించారు. ఎస్సీ వర్గీకర ణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగల జనాభాకు తగినట్లుగానే రిజర్వేషన్ల వాటా ఉండాలని చెప్పారు. ఏ ప్రాతిపదికన తీసుకున్నా మాదిగలకు 11 శాతం రిజర్వే షన్లు రావాలని స్పష్టంచేశారు. కానీ ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో తమకు 9 శాతమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి రిజర్వేషన్ల పంపి ణీలోని లోపాలను సరిదిద్ది ముందుకు వెళ్లాలని సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News