నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి) : జర్నలిస్టులకు అండగా ఉంటూ వారి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీ.యూ.డబ్ల్యూ.జె) ( ఐ.జె.యూ అనుబంధం) పని చేస్తోందని సీనియర్ జర్నలిస్ట్, ఐ.జె.యూ కోరుట్ల ప్రెస్ క్లబ్ సలహాదారులు బీవీ రంగారావు, ఐ.జె.యూ కోరుట్ల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు సకినవీటి సత్యారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కోణార్క్ గార్డెన్ లో యూనియన్ జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లె రాము ఇటీవల కోరుట్ల కోర్టు బార్ అసోసియేషన్ లో సభ్యత్వం పొంది కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించిన సందర్భంగా అల్లె రాము ను శాలువాతో సన్మానించారు. అలాగే ఐ.జె.యూలో నూతనంగా చేరిన సియాసత్ సీనియర్ రిపోర్టర్ సలీమ్ ఫారుఖీ కి నూతన సభ్యత్వం రసీదు అందజేశారు. అలాగే మహారాష్ట్రలో అవార్డు పొందిన సలీమ్ ఫారుఖీని శాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ..జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటామని, జర్నలిస్ట్ లకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మహ్మద్ ముబీన్, మిట్టపల్లి వెంకటరమణ, కొండ్లెపు అర్జున్, వనతడుపుల నాగరాజు, గొల్లపల్లి గణేష్,కట్టెకోల సురేష్, కోడూరి ప్రేమ్ , బాలె అజయ్, మహ్మద్ అలీ, కోయల్కర్ ప్రవీణ్, అరిసెల్ల మనోహర్, సంగ మహేష్, కంచి రమేష్, మహ్మద్ మాజ్, రాచర్ల సుమన్, బాలె మహేష్, మహ్మద్ ఖైజర్ తదితరులు పాల్గొన్నారు.





