- ప్రభుత్వ ఉద్యోగాలు ఇపిస్తానంటూ లక్షల్లో డబ్బులు వసూలు
- సిరిసిల్లలో కటకం మృత్యుంజయం బాధితులు ఆందోళన

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల (కోక్కుల వంశీ) : మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం తో ప్రాణహాని ఉన్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాధితులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పేదల భూములను అక్రమంగా కబ్జా చేస్తు,ప్రభుత్వ ఉద్యోగాలు ఇపిస్తానంటూ లక్షల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్నాడని ఆరోపించారు. ఖాళీ భూమి కనిపిస్తే చాలు, లిటికేషన్ సృష్టించి కబ్జాలు పెడుతున్నారని 50 సంవత్సరాల నుండి వున్న ఇండ్లను కూల్చివేస్తాను అంటూ బెదిరింపులకి గురి చేస్తున్నాడని అన్నారు. వ్యాపారవేత్తల వద్ద దగ్గర మెటీరియల్ తీసుకొని డబ్బులు అడుగుతే చంపుతానని బెదిరించాడని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మాకు న్యాయం చేయాలని అన్నారు. కటకం మృత్యుంజయం పై విచారణ కమిటీ వెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భోజనగారి శంకర్, కొప్పు అమృత, మారవేణి దేవలక్ష్మి, ఐత సంతోష్, మహబూబ్, మెట్టపెల్లి ఆంజనేయులు, రాజు, చిట్టీపల్లి నాంపల్లి, మేకర్తి మల్లేశం మిట్టపెలి బాలరాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారులు మారవేణి రంజిత్ కుమార్ పాల్గొన్నారు.





