నేటి సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కురుమల శ్రీను చే బుర్ర నాగరాజు గౌడ్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఇచ్చిన పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రజాసేవకై నిరంతరం పాటుపడతానని అన్నారు. కన పదవికి కారకులైన కురుమల శ్రీను గారికి మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇన్చార్జి మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డి సి సి అధ్యక్షుడు కబాలి సత్యనారాయణ, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు.





