Wednesday, March 18, 2026

బాలుడికి వైద్యానికి రూ.15 వేల ఆర్థిక సాయం అందజేత

  • మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కొక్కుల వంశీ ) : వేములవాడ పట్టణం, అంబేద్కర్ నగర్ కు చెందిన ఆరెల్లి విజయ్ కుమారుడు ఊపిరితిత్తులలో రక్తస్రావంతో బాధ పడుతుండగా సిరిసిల్ల కరీంనగర్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ అంకుర హాస్పిటలుకు తీసుకుని వెళ్లినట్లు అక్కడ ఐసియూలో చికిత్స జరుగుతున్నట్లు అబ్బాయి తండ్రి విజయ్ తెలియజేస్తూ చిన్నారి పాపకు ఆపరేషనుకు మీవంతు సహాయ సహకారాలు అందించండి అని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను కోరడంతో ట్రస్టు మరియు ఇతర సోషల్ మీడియా గ్రూపులో పోస్ట్ చేయడం జరిగింది. దాతలు మానవతా దృక్పథంతో స్పందించి 14319/- రూపాయలు ఆర్థిక సాయం అందించడంతో ట్రస్ట్ ద్వారా మరి కొంతకలిపి చిన్నారిబాబు ఆపరేషనుకు రూ.15,000/- రూపాయాల చెక్కు ఆర్థిక సాయంగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, వొడ్యాల వేణు, పొలాస రాజేందర్, తోట రాజు, నంది సాయికుమార్, నాగుల నాగరాజు, చింతల లక్ష్మణ్ మరియూ బాధితుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News