Wednesday, March 18, 2026

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలి

  • జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ విసి సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆసుపత్రుల పర్యవేక్షకులతో సమావేశమై ఆసుపత్రుల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల లోకి నర్సంపేట వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రి విలీనం చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. నర్సంపేట టి హబ్ లో వైద్య పరీక్షల నిర్వహణ సక్రమంగా లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, నిర్లక్ష్యాన్ని వీడి, వైద్య పరీక్షలు చేసిన వెంటనే రిపోర్ట్ లు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్ధ వంతంగా వైద్యసేవలు అందేలా నిత్యం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడాలని , రోగుల సంఖ్య పెరగాలని అన్నారు.
ఈ సమావేశంలో డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, పర్యవేక్షకులు స్వామి, ప్రొఫెసర్, కిషన్, డాక్టర్ రామ్మూర్తి, డాక్టర్ లత తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News