
నేటి సాక్షి , మునగాల
మండల పరిధిలోని అటవీ, రెవిన్యూ భూముల్లో పలువురు దళారులు ఇష్టాను సారంగా మట్టి తవ్వకాలను చేపడుతున్నారు. మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో ఈ తంతు కొనసాగుతుంది. కానీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి దళారులు అక్రమంగా గండి కొడుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై పలువురు మండిపడుతున్నారు. రోడ్డు నిర్మించే కాంట్రాక్టర్ తో అధికారులు కుమ్మక్కైనట్లు తెలుస్తుంది. ఇలాంటి మట్టి మాఫియా వారిని అరికట్టాల్సిన అధికారులే దళారులు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడుతున్నారా అనే కోణంలో ప్రజలు ఆలోచనలో పడుతున్నారు. టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యారని అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవటంతో వారి పాత్ర పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వెంటనే అధికారులు స్పందించి ఈ మట్టి మాఫియా దళారులకు చెక్ పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.





