
నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి):
కోరుట్ల మండలం గుమ్లాపూర్ గ్రామంలో గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం శనివారం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త యాదగిరి నవీన్ రావు,సవిత దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త యాదగిరి నవీన్ రావు, సవిత దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ” శ్రీ వెంకటేశ్వర సేవా సమితి ” సంఘ సభ్యులు సేవా కార్యక్రమాలు చేశారు. విద్యార్థుల భక్తి పాటల నృత్యలు అలరించాయి. మరిగంటి శ్రీ వాత్సవ్ అర్చక బృందం పూజా కార్యక్రమాలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయినిపల్లి సత్యనారాయణ,బీసీ సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డ వెంకటేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, కోరుట్ల కేశవ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ దిలీప్ రావు, డాక్టర్ కేశవ్ రావు,. మరియు నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





