Wednesday, March 18, 2026

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం..!

  • మనాలలో బీజేపీ నాయకుల సంబురాలు..

నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి : ( కోక్కుల వంశీ )
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడగా డిల్లీ ప్రజలు అవినీతి ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి, బీజేపీ పార్టీకి ఘన విజయం అందించడంతో రుద్రంగి మండలం మానాల గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి, స్వీట్లు పంచి, సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సారథ్యంలో ఢిల్లీలో బీజేపీ పార్టీ 27 ఏండ్ల తరువాత అధికారంలోకి రావడం సంతోషకరమన్నారు. గత 10 సంవత్సరాలుగా ఢిల్లీలో కొనసాగుతున్న అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. గతంలో జరిగిన మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పిన, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదని, ఢిల్లీ ఎన్నికల్లో మరొకసారి ఖాతా తెరవకుండా కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న దేశ అభివృద్ధిని చూసి ఢిల్లీ ప్రజలు బీజేపీ పార్టీకి అధికారం కట్టబెట్టారని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌తో సహా ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని ఓడించి ప్రజాధనాన్ని దోచుకునే వారిని క్షమించబోమని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని, అభివృద్ధి, సంక్షేమానికి అందలం ఎక్కించి, అవినీతి, అబద్ధాలకు ఢిల్లీ ప్రజలు గుణపాఠం నేర్పారని అన్నారు. కాంగ్రెస్ సమాధిపై ఢిల్లీ ప్రజలు మరో రాయిని పేర్చారని ఎద్దవా చేశారు. బీజేపీకి పట్టం కట్టి దేశ రాజధానిని ఒక వికసిత్ ఢిల్లీగా తీర్చిదిద్దడానికి బాటలు వేసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మోడీ నేతృత్వంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి విజయ డంక ముగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూం రామేష్, బత్తిని సురేష్, నరేష్ నాయక్, తుమ్ గంగాధర్, గోలి రవి, తుమ్ గంగాధర్, పొన్నోజి గంగాధర్, సంతోష్, అల్లూరి రాము బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News