నేటిసాక్షి, వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలం వెంకటాపురం ( నూగూరు ) సర్కిల్ లో గల పేరూరు పోలీస్ స్టేషన్ ను ఏటూరునాగారం ఏ ఎస్ పి శివమ్ ఉపాధ్యాయ శనివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేసి స్టేషన్ కు సంబంధించిన అన్ని రికార్డ్స్ లను పరిశీలించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో పాటిస్తున్న 5-ఎస్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఇలాగే కొనసాగించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ మొత్తం పరిసరాలు సిఅర్పిఎఫ్ క్యాంపు లోని అన్ని గార్డులను తనిఖీ చేసి తగు జాగ్రత్తలను చూసించారు. సిఅర్పిఎఫ్ డిఎస్పి తో సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో కొత్తగా నిర్మిస్తున్న సెక్యూరిటీ పెన్సింగ్ గురించి తగు సూచనలు చేశారు వెంకటాపురం సిఐ బండారి కుమార్ పేరూరు ఎస్ఐ జి. కృష్ణ ప్రసాద్ లకు సిబ్బందికి గంజాయి గుడుంబా కోడిపందాలు పేకాట అటవీ జంతువుల వేట గురించి విద్యుత్ తీగలు పెట్టె వారిని ఉపేక్షించరాదని వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు పడేలా చూడాలని మావోయిస్టుల కదలికల పైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని ఏఎస్పి ఆదేశించారు.





