- కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ఆదేశించారు

మెదక్ జిల్లా నేటి సాక్షి, భూమయ్య : నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యాటకుల కోసం నిర్మిస్తున్న కాటేజీ నిర్మాణ పనులను సంబంధిత ఆర్డిఓ మహిపాల్ రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాస్, లతో కలిసి శనివారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతూ ప్రకృతి రమణీయతను ఆకలింపు చేసుకుని పర్యాటకుల మదిని ఆకర్షించే చూడ చక్కని ప్రదేశాలు కలవని ఇందులో అర్బన్ ఫారెస్ట్ పార్క్ చూడ చక్కని ప్రదేశమన్నారు. పర్యాటకుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని కాటేజీలు నిర్మాణం చేపట్టి ఉపయోగంలోకి తీసుకువచ్చినట్లయితే ఆదాయ మార్గాలు మెండుగా ఉంటాయని తెలిపారు. మొత్తం 32 కాటేజీలు నిర్మాణం చేపట్టగా ప్రస్తుతం పది కాటేజీలు నిర్మాణం పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయని 22 నూతనంగా వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. నిర్దేశిత గడువు తేదీలోగా పూర్తిచేసి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాధవి లత, సంబంధిత అటవీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.





