జక్కే వీరస్వామి గౌడ్ రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు
సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము
నేటి సాక్షి, జమ్మికుంట :
సమగ్ర కులగణన లో బీసీ లు 46 శాతం ఉన్నట్టుగా సర్వే ఫలితాలు చూపటం పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని 2014 లో గత ప్రభుత్వం 52 శాతం ఉన్నట్టుగా అధికారికంగా ప్రకటించకున్న సర్వే రిపోర్ట్ గణoకాలు చెబుతుంటే 2024 లో 46 శాతం ఉన్నట్టు బీసీ జనాభాను తగ్గించి చూపటం బీసీ లను రాజకీయంగా అణిచివేయలనే కుట్ర జరుగుతోందని గత పది సంవత్సరాల్లో బీసీ జనాభా దాదాపు 5 శాతం పెరిగిందని అగ్రకులాల జనాభా పెరుగకున్న 2 శాతం పెరిగినట్టుగా తప్పుడు సర్వేలు చూపి ఈ డబ్ల్యు ఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి బీసీలను బలిపశువులను చేస్తున్నారని హిందు బీసీలుగా ముస్లిం బీసీలుగా బీసీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం మానుకోవాలని ఏ మతం లో ఉన్న ఏ కులం లో ఉన్న బీసీలు బీసీలుగానే సర్వే రిపోర్ట్ ఉండాలని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అధ్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్ రాష్ట ప్రభుత్వపై అగ్రహంవ్యక్తం చేశారు. అలాగే బీసీల్లో గౌడ ఈడిగ శ్రీశయన శెట్టిబలిజ ఉపకులలైన గౌడశెట్టి ఏనుగుటి పటం కులాల్లోని మొత్తం జనాభా దాదాపు 26 లక్షలు ఉంటే 16 లక్షలు ఉన్నట్టు సర్వే రిపోర్ట్ ప్రకటించటం విడ్డురంగా ఉందని వీరస్వామిగౌడ్ మండి పడ్డారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే గౌడ జనాభా దాదాపు 5 లక్షల జనాభా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీ తెలంగాణ ను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరిగే విదంగా పోరాడుతుంటే తెలంగాణలో రెడ్ల నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలను అణిచి వేస్తోందని కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి అన్యాయం చేస్తోందని వీరస్వామిగౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాలయాపన చేసి రిజర్వేషన్ అమలుచేయకుండా హడావిడిగా అసెంబ్లీ ఆమోదం తెలిపి కేంద్రప్రభుత్వం మీద నెట్టి తప్పించుకోవాలని చూస్తోందని ఈ కుట్రను బీసీలు పసిగట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుటిల రాజకీయాలను ఎండగట్టాలని వీరస్వామిగౌడ్ డిమాండ్ చేశారు. మొదటి నుండి కూడా ఆంధ్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీగా అవతరించి బీసీలను పాలితులను చేసారని ఇప్పుడు కూడా అదే కుట్ర జరుగుతోందని వీరస్వామిగౌడ్ మండి పడ్డారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు జాతీయ నాయకత్వం ఆలోచించాలన్నారు లేకుంటే తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయటానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని ఇప్పటికైనా బీసీ కుల గణన చేపట్టి రిజర్వేషన్ ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని లేకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి బంగ పాటు తప్పదని వీరాస్వామి గౌడ్ హెచ్చరించారు. ఈ పరిణామాలు చూస్తుంటే అగ్రవర్ణ పార్టీల చేతుల్లో అణిచి వేతకు గురవుతున్న బీసీలు రాజకీయంగా బీసీల నాయకత్వంలో కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని వీరస్వామిగౌడ్ సూచించారు.





