- టిపిటిఎల్ఏ ప్రెసిడెంట్ రహమాన్.
- జమ్మికుంటకు విచ్చేసిన ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు వినతి
నేటి సాక్షి ,జమ్మికుంట
రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేటు ఉపాధ్యాయుల మరియు లెక్చరర్స్ సమస్యల ను పరిష్కరించినటువంటి వారికే మా మద్దతు ఉంటుందని టిపిటిఎల్ఏ అధ్యక్షులు రహమాన్ అన్నారు. ఆదివారం జమ్మికుంట పట్టణానికి ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ విచ్చేసిన సందర్భంగా వారికి ప్రైవేటు ఉపాధ్యాయుల డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిలో భాగంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా, డబుల్ బెడ్ రూమ్ వసతి, ఉద్యోగ భద్రత,ఆరోగ్య భద్రత కల్పించాలని అటువంటి వారికే మా యొక్క మద్దతు ఉంటుందని ప్రసన్న హరికృష్ణకు వినతిపత్రం సమర్పించారు. విషయాలను గమనించిన ప్రసన్న హరికృష్ణ సానుకూలంగా స్పందించి తనను గెలిపించినట్లయితే భవిష్యత్తులో ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం కోసం తన వంతుగ కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎల్ఏ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, సతీష్, ప్రధాన కార్యదర్శి చల్లూరి సదయ్య , ట్రెజరర్ ఆకుల పద్మ , మీడియా కన్వీనర్ మహమ్మద్ అంకూస్, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ పాల్గొన్నారు.





