Wednesday, March 18, 2026

బ్లాక్‌మెయిల్ రిపోర్టర్లు

  • విలేకరుల వేషంలో చీకటి వ్యాపారం
  • నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన*
  • ఏడుగురు నకిలీ విలేకర్ల అరాచకం బయటపడి పోలీస్ కేసు*

నేటి సాక్షి, వేమనపల్లి: వార్తా స్వేచ్ఛను వక్రీకరించి, విలేకరి వేషంలో అక్రమ దందాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌పై నీల్వాయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్థానిక ఎస్సై శ్యాం పటేల్ వెల్లడి మేరకు, గోదావరిఖనికి చెందిన జక్కుల శ్రీధర్, మొగిలి అనిల్ లు సుంపుటం గ్రామంలో ఆరు ఎడ్లను కొనుగోలు చేసి పెద్దపల్లి పశువుల సంతకు తరలిస్తున్న సమయంలో ఈ దొంగ విలేకర్ల అరాచకం బయటపడింది.

విలేకరుల ముసుగులో దోపిడి
ఆ రోజు తెల్లవారుజామున ఏపీ 36ఎం 1166 నంబర్ గల ఫోర్డ్ కారులో వచ్చిన ఏడుగురు వ్యక్తులు చొప్పదండి జనార్ధన్ (నేటితరం విలేకరి, డిజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు)
తుంగ రమేష్ (జిల్లా వాణి)
మాసాని రమేష్ (భద్రాద్రి న్యూస్)
తోడేటి సంతోష్ (జిల్లా వాణి)
జిల్లపల్లి పోచం (జిల్లా వాణి)
తగరం వెంకటేష్ (ధ్రువ న్యూస్)
దొబ్బల విష్ణు (జిల్లా వాణి)
ఈ నిందితులు వ్యానును అడ్డగించి, తాము విలేకరులమని గొప్పలు చెప్పుకుంటూ, పశువులను తరలించేందుకు వీలులేదని బెదిరించారు. అంతటితో ఆగకుండా రూ.3 లక్షలు డిమాండ్ చేయగా, బాధితులు తిరస్కరించగా తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించి, జనవరి 20న రూ.25 వేలు, ఫిబ్రవరి 3న రూ.15 వేలు ఫోన్ పే ద్వారా వసూలు చేసుకున్నారని బాధితులు వివరించారు.

న్యూస్ పేరిట నేరాలు – కేసు నమోదు
దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు నీల్వాయి పోలీసులు విచారణ చేపట్టి, ఈ ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రజలను బెదిరించి లంచాలు వసూలు చేసే ఇటువంటి దోపిడి విలేకర్లను ఎవరైనా ఎదుర్కొంటే, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్సై శ్యాం పటేల్ సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News