- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : 2011జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల జనాభా 15శాతం ఉందని కానీ ఉప్పుడు 18 శాతనికి పెరిగిందని, జనాభా ప్రాతి పదికన రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాలయాపన జరగకుండా తక్షణమే షెడ్యూల్ కులాలకు ఏ. బీ. సి వర్గీకరణ ఆధారంగా అమలు చేయాలని కోరారు. దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాని సమయంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి షెడ్యూల్ కూలాల వర్గీకరణకు చట్టభద్దత కల్పించడంతో పాటు షెడ్యూల్ కులాలను ఏ. బీ. సి కేటగిరీలు గా రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాదిగ, మాదిగ ఉప కులాల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే ఆలోచనతో మాత్రమే ప్రభుత్వ సహకారం కావాలనే తలంపుతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నా నిర్ణయానికి ప్రజల నుండి కూడా మద్దతు లభించింది, దానికి ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కంటే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుండి అత్యధికంగా భారీ మెజార్టీ 55 వేల మెజార్టీ వచ్చింది.





