- హోరాహోరిగా సాగిన ఫైనల్ మ్యాచ్

నేటి సాక్షి, మందమర్రి:- మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్ లో చిర్రకుంట 11 జట్టు, నస్పూర్ కు చెందిన రుద్ర 11 జట్లు తలపడగా, నస్పూర్ జట్టు విజేత నిలువగా, చిర్రకుంట జట్టు రన్నర్ గా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో పాల్గొనడంతో శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉంటారని తెలిపారు. కాకా వెంకటస్వామి పేరుమీద గ్రామీణ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కాకా చేసిన సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గ్రామ మాజీ సర్పంచ్ పెద్దపల్లి చంద్రకళ, నాయకులు బచ్చల రాములు, ఎండి తాజుద్దీన్, యాదగిరి మల్లేష్, రేషవేణి లింగయ్య, బచ్చలి రాములు, రామగిరి కుమారస్వామి, అసంపల్లి శివకుమార్, బచ్చలి పోసు లు పాల్గొన్నారు.





