
నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): మండలంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించి పలు కారణాలతో మరణించిన వారి కుటుంబాలను ఆదివారం పరామర్శించారు. ముందుగా మండల కేంద్రానికి చెందిన చీకటి వెంకటేష్ ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాజారాంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేరుగు జానీ మామ జక్కుల మల్లయ్య అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన నేరెల్ల మల్లేశం తండ్రి నారాయణ అనారోగ్యంతో మరణించగా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, ఓదార్పు అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏలేటి కృష్ణా రెడ్డి, రాజారాంపల్లి మాజీ యంపిటీసీ సభ్యులు గాజుల మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడిదం నారాయణ, సీనియర్ నాయకులు పడిదం వెంకటేష్, మేరుగు జానీ, ఉప్పు రాజయ్య, వుస్కమల్ల పరందాములు, రాజారాంపల్లి గౌడ సంఘం అధ్యక్షులు పోడేటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.





