Thursday, March 19, 2026

మద్యానికి బానిస అవుతున్న జనాలు

  • మండలంలో విచ్చల విడిగా కల్తీ మద్యం అమ్మకాలు
  • ఆసరాగా తీసుకుంటున్న బెల్ట్ షాపులు
  • కల్తీ మద్యంతో ఆస్పత్రుల పాలవుతున్న మద్యం ప్రియులు
  • బెల్టు షాపులపై నిఘా ఏది
  • ఎక్సైజ్ అధికారులకు వాటా ఎంత?
  • నిద్రపోతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మకాలు జోరుగా కోనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఆదివారం రోజున కమలాపూర్ మండలంలోని మర్రిపల్లి గ్రామంలో తుమ్మల రమేష్ బెల్ట్ షాప్ లో కల్తీ మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రుల పాలైన ఘటన మర్రిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కింగ్ ఫిషర్ లైట్ బీర్లు తాగుతున్న వేళ తాగుతున్న మధ్యాన్ని గమనించిన మద్యం ప్రియులు ఒక్కసారిగా వారు తాగుతున్న బీరు మద్యంలో పేపర్ రూపంలో ఉన్న వ్యర్థ పదార్థాలు చూసి షాక్ కు గురయ్యారు.

అంతకుముందే మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో ఆస్పత్రుల పాలవ్వడం చెప్పుకోదగ్గ విషయం. సమాచారం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలి వెళ్లడంతో పాటుగా ఆ ఊరి బెల్ట్ షాపుల పై మరియు మద్యం అమ్మకాలపై తీవ్రంగా మండిపడ్డారు. అదృష్టవశాత్తు కల్తీ మద్యం తాగిన వ్యక్తులు ఎలాంటి ప్రమాదం జరగకుండా డాక్టర్ల పర్యవేక్షణలో సుమారు 12 గంటలు ఆస్పత్రిలో వైద్యం తీసుకొని ఇంటికి రావడం జరిగిందని సంబంధిత బంధువులు తెలిపారు. ఇది ఇలా ఉండగా కమలాపూర్ మండలంలోని ఎన్నో ఏళ్లుగా ఏదో విధంగా మద్యం ప్రియులు కల్తీ మద్యం తాగి ఆస్పత్రుల పాలవుతున్నారే తప్ప మద్యం అమ్మకాలు కానీ, బెల్ట్ షాపుల్లో కానీ,ఎక్సైజ్ అధికారుల్లో కాని ఎలాంటి మేలుకొలుపు లేదంటే వైన్ షాపు వారు ఎక్సైజ్ అధికారులకు ఎలాంటి, ఏ విధంగా ముడుపులు అప్పజెప్తున్నారనేది సందేహంగా మారింది. ఎన్నో సందర్భాలలో గత కొంతకాలంగా ఇలాంటి వార్తలు ప్రింట్ మీడియాలో ప్రచురితం అయినా కూడా ఎక్సైజ్ అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. కష్టజీవులు రోజువారి కూలీ చేసుకుంటే తప్ప బతకలేని జీవనం కొనసాగించే ప్రజల జీవితాలు మద్యానికి బానిసై బలవుతున్న కూడా ప్రభుత్వం కానీ, ఎక్సైజ్ అధికారులు కానీ చీకట్లో ఉన్నారే తప్ప వెలుగులోకి వచ్చి ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరిగే అన్యాయాలను వెలుగులోకి తీసుకువచ్చే అధికారులే కరువయ్యారు. ఇకనైనా మేలుకొని ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపుల పట్ల, కల్తీ మద్యం అమ్మే వైన్స్ ల పట్ల పలు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News