- అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : ప్రజల నుండి వచ్చే వినతుల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 12 మంది, మరో 47 మంది వినతులు ద్వారా సమస్యలను విన్నవించారని అదనపు కమిషనర్ తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ట్యాక్సీ స్టాండ్ వద్ద మరుగుడొడ్లు ఏర్పాటు చేయడం వలన అదే జీవనంగా గడుపుతున్న ట్యాక్సీవాలా లకు ఇబ్బంది అవుతుందని పునఃపరిశీలించాలని కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్రలు కోరారు. కపిలతీర్థం నుండి నీరు ప్రవహించే కాలువకు అడుగుభాగం కాంక్రీట్ వేయడం వలన నీరు ఇంకడం లేదను పరిశీలించాలని, టి.డి.ఆర్. బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కొరకు డబ్బులు కట్టామని ఇల్లు ఇవ్వలేదని మా డబ్బులు తిరిగి ఇవ్వాలని, సుందయ్య నగర్ లో కుక్కల బెడద పరిష్కరించాలని, మురుగునీటి కాలువ పొంగి పొర్లుతోందని, మునిసిపల్ పార్క్ నుండి వేసిన రోడ్డు నందు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, కొంక చెన్నాయగుంట నందు డ్రైన్లు, సి.సి.కాలువలు ఏర్పాటు చేయాలని, మా బోర్ నందు మురుగునీరు కలుస్తున్నది పరిష్కరించాలని, అపార్ట్మెంట్ నందు ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ ఇప్పించాలని, రైతు బజార్ ముందు ఇతర వ్యాపారుల వలన ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని పరిష్కరించాలని, గోవిందనగర్ రోడ్డులో బోర్ వేశారని ఆ ఇబ్బంది తొలగించాలని కోరారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డి.ఈ. లు, సూపరింటెండెంట్లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.





