- వివిధ పార్టీలకు చెందిన పలువురు బీఎస్పీ పార్టీలో చేరిక

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని డాక్టర్ నీలకంటేశ్వర్ గౌడ్ ఈఎన్టి ఆసుపత్రి ప్రాంగణంలో సోమవారం బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించగా, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి కాదాసి రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ, బిఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ సిద్ధాంతాలను మాయావతి ముందుకు తీసుకుపోతున్నారన్నారు.

ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు వివరించారు. అనంతరం కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ వివిధ పార్టీలకు చెందిన పలువురు బీఎస్పీ పార్టీలో చేరిగా, వాటికి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సింగతి రంగనాథ్, వేముల వీరేందర్, దాగం శ్రీనివాస్, గాజుల శంకర్, ఎండి మతిన్ ఖాన్, రామిల్ల రాజేష్, కొంకటి రవీందర్, మడిపల్లి రాములు, కుమ్మరి కృష్ణ చైతన్య, దుర్గం శివకుమార్, దుగుట రాకేష్, మంతెన రవివర్మ లు కలరు. ఈ కార్యక్రమంలో బిఎస్పి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





