- నేతకాని రాష్ట్ర ఉపాధ్యక్షులు దికొండ కాంతారావు
ప్రజాపక్షం, మంగపేట : ములుగు జిల్లా ఏటూరు నాగారంలో తెలంగాణ నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేతకాని కుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు జాడి రాంబాబు అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కుల వర్గీకరణ చేయడం జరిగింది. ఈ కుల వర్గీకరణ మా నేతకానిలకు తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎస్సీ నేతకాని సామాజిక వర్గం 1,33,000 జనాభా ఉందని కానీ ఇది వాస్తవం కాదు. మా నేతకాని జనాభా ములుగు జిల్లాని ఉదాహరణగా తీసుకున్నట్లయితే మంగపేట ఏటూరునాగారం వాజేడు వెంకటాపురం కన్నాయిగూడెం తాడ్వాయి గోవిందరావుపేట ములుగు సుమారుగా 40,000 జనాభా ఉంది అంటే ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీగా బెల్లంపల్లి నియోజకవర్గం చెన్నూరు మందమర్రి గోదావరిఖని, మంచిర్యాల జగిత్యాల భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం కాగజ్ నగర్ వివిధ ప్రాంతాలలో మొత్తం జనాభా 18 లక్షలు పైచిలుకే. దరిదాపు ఈ నేతకాని ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారు. దీని పై ప్రభుత్వం మరొక సారి ఆలోచన చేసి మా నేతకాని ప్రజానీకాన్ని రిసర్వే చేసి మా నేతకాని సమాజానికి న్యాయం చేయగలరు ఈ ఎస్సీ వర్గీకరణ మూడు విభాగాలు చేశారు. దానిలో మా నేతకాని సామాజిక వర్గాన్ని మూడవ కేటగిరీలో చేర్చడం వలన పూర్తి స్థాయిలో మా నేతకాన్ని ప్రజలు అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.మూడో కేటగిరీలోకి చేర్చడం వలన మా నేతకాని సమాజానికి అభివృద్ధి గాని, సంక్షేమ ఫలాలు కానీ అందే అవకాశం లేదు. నేతకాని కులానికి ప్రత్యేకమైనటువంటి ఒక కేటగిరీని కల్పించండి. అప్పుడు నేతకాని కులం వారికీ న్యాయం జరుగుతుంది తప్ప ఇప్పుడు చేసినటువంటి వర్గీకరణను అలానే ఉంచినట్లయితే తీవ్ర నష్టానికి గురి కావడం జరుగుతుంది.పూర్తి స్థాయిలో దీనిపై ప్రభుత్వం పునర్ ఆలోచన చేసి మా నేతకాని జనాభాకి తగ్గట్టు వారికి రిజర్వేషన్లు కల్పించి,తగు న్యాయం చేయగలరని, అదే విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మా నేతకాని సమాజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఇట్టి హామీని ప్రభుత్వం తక్షణమే మాకు మంజూరు చేసి మా నేతకానిలా పక్షాన నిలబడి మాకు న్యాయం చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండు చెయ్యడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బక్కయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డిగొండ కాంతారావు, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు కుమ్మరి చంద్రబాబు, రాష్ట్ర నాయకులు కొండగొర్ల పోచయ్య, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి రాంబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్లు జాడి బోజరావు, బసారికరి నాగార్జున జిల్లా నాయకులు సునరికని శ్రీరాములు, జనగం చెన్నేశ్వర్ రావు,కుమ్మరి వెంకట్, కావిరి రాంబాబు, సోదరి వెంకటేష్, కుమ్మరి సంతోష్, జాడి నరేష్, బెడిక లక్షమయ్య మరియు వివిధ మండలాల నేతకానీ కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.





