Wednesday, March 18, 2026

దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కొరకు ప్రత్యేక శిబిరాలు

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణములను ఉచితంగా పంపిణీ చేసేందుకు జిల్లా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, అలింకో సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జైపూర్, నస్పూర్, మంచిర్యాల, హాజీపూర్ మండలాల వారికి ఈ నెల 17వ తేదీన మంచిర్యాల పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్, చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, భీమారం మండలాల వారికి ఈ నెల 18వ తేదీన చెన్నూరు పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్, బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, మందమర్రి రూరల్, అర్బన్ ప్రాంతాల వారికి ఈ నెల 19వ తేదీన బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల రైతు వేదిక, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల వారికి ఈ నెల 20వ తేదీన లక్షెట్టిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శారీరక దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్, మూడు చక్రాల రిక్షా, వీల్ చైర్, చంక కర్రలు, చేతి కర్రలు, బదిరులకు (మూగ, చెవిటి) శ్రవణ యంత్రాలు, అంధులకు ప్రత్యేక మొబైల్ ఫోన్లు, చేతి కర్రలు, మానసిక దివ్యాంగులకు ప్రత్యేక కిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ పొందేందుకు 80 శాతం వైకల్యం, ఇతర సహాయ ఉపకరణాలకు 40 శాతం, ఆపైన తప్పనిసరిగా ఉండాలని, యుడిఐడి కార్డు, కార్డు నమోదు రశీదు నకలు ప్రతి, సదరం వైద్య ధృవపత్రము, జిల్లా మెడికల్ బోర్డు, అప్పిలేట్ మెడికల్ బోర్డు జారీ చేసిన వైద్య ధృవీకరణ పత్రము నకలు ప్రతి, ఆధార్ కార్డు, కార్డు నకలు ప్రతి, సంబంధిత తహశిల్దార్ చే పొందిన ఆదాయ ధృవపత్రము (గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్షా 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల 50 వేల రూపాయలకు మించి ఉండరాదు), దరఖాస్తుదారుని వయస్సు 16 సంవత్సరాల కంటే తక్కువ ఉండరాదు, ఒక్కొక్క దరఖాస్తుకు 2 చొప్పున వైకల్యం కనపడే విధంగా ఉన్న ఫొటోలు జత చేయాలని తెలిపారు. నిర్ణీత తేదీలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్యాంప్ కు హాజరయ్యే వారు తప్పనిసరిగా సదరం ధృవపత్రంతో యుడిఐడి కార్డు లేని వారు ఆన్లైన్లో https://www.swavlambancard.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసిన రశీదు తీసుకొని రావాలని తెలిపారు. గత 3 సంవత్సరాల కాలంలో శాఖ ద్వారా ఏ రకమైన సహాయ ఉపకరణాలు పొందిన యెడల వారికి ప్రాధాన్యత కల్పించడం జరుగదని తెలిపారు. ఇతర వివరాలకు 6300556075, 8688531109 నంబర్లలో సంప్రదించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News