Thursday, March 19, 2026

అడవులను కాపాడుతూ.. వన్యప్రాణులను సంరక్షించాలి

నేటి సాక్షి, వేమనపల్లి : చెన్నూరు డివిజన్ కోటపల్లి అటవీ క్షేత్ర పరిధిలోని ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను సోమవారం వైల్డ్ లైఫ్ పిసిసిఎఫ్ ఎలూసింగ్ మేరు,ఎఫ్డిపిటి కవ్వాల్ టైగర్ రిజర్వ్ శాంతారాం, డీఎఫ్ఓ మంచిర్యాల శివ ఆశిష్ సింగ్, ఎఫ్డివో చెన్నూరు సర్వేశ్వర్ లు కలిసి సోమవారం తనిఖీ చేశారు.వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో జరుగుతున్న పనులతో పాటు గడ్డి మైదానాలు, సోలార్ బోరు, నీటి కుంటలు, దారులు తనిఖీ మొదలైన పనులను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా అటవీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ సిబ్బంది వేసవికాలంలో వన్య ప్రాణుల దాహార్ది, అటవీ అగ్ని ప్రమాదాల నుండి కాపాడుటకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.అనంతరం నీల్వాయి అటవీ క్షేత్ర అధికారి కార్యాలయ పరిసరాలు పరిశీలించారు. వీరితో ఎఫ్ఆర్ఓ చెన్నూరు శివకుమార్, ఎఫ్ఆర్ఓ కోటపల్లి సదానందం, ఎఫ్ఆర్ఓ నీల్వాయి అప్పలకొండ ఇతర అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News