Wednesday, March 18, 2026

మాల సంఘం నేతలు నేతకాని సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి

  • నేతకాని మహర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సునార్కర్ రాంబాబు
  • రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్ల రాజమల్లు

నేటి సాక్షి, మందమర్రి:- నేతకాని సమాజాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మాల సంఘ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేతకాని మహర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సునార్కార్ రాంబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్ల రాజమల్లు లు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణలో నేతకాని కులానికి జరిగిన అన్యాయంపై హైదరాబాద్ వేదికగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేతకాని కులానికి మద్దతుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, మాజీ పార్లమెంట్ సభ్యుడు బోలకుంట వెంకటేష్ నేత, సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ లు గ్రూప్-3లో మాలలతో పాటు నేతకాని కులాన్ని చేర్చడం వల్ల నేతకాని కులంలో ఉన్న చదువుకున్న విద్యార్థులకు రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్ లలో అన్యాయం జరుగుతుందని తెలిపారన్నారు. దీనిని ఓర్వలేని మాల సామాజిక వర్గానికి చెందిన పైడిమల్ల నర్సింగ్ అనే మాల సంఘం నాయకుడు నేతకాని కులం పై అనుచిత వాక్యాలు చేయడమే కాక మాజీ పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ లను ఇష్టానుసారంగా మాట్లాడి, కించపరచడం జరిగిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణలో నేతకాని సామాజిక వర్గం జనాభాని తక్కువగా చూపించడం, నేతకాని కులం గ్రూప్-3లో ఉంచడం వల్ల రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనక పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తే, మాల సామాజిక వర్గంలోని కొంతమంది పైడిమల్ల నర్సింగ్ లాంటి వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెట్టేలా, రెచ్చగొట్టే వాక్యాలు చేయడమే కాక మాదిగ, బీసీ కులాలను సైతం అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని నేతకాని మహర్ కుల పరిరక్షణ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నేతకాని సామాజిక వర్గం నుంచి బోర్లకుంట వెంకటేష్ నేత గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించడాన్ని ఓర్వలేక నేడు మాల సంఘం నాయకులు నేతకాని సమాజాన్ని అణిచివేసే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఓవైపు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే వివేక్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరగా, అందుకు విరుద్ధంగా పట్టణానికి చెందిన మాల సంఘం నాయకులు నేతకాని కులాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. మాల సంఘం నేతలు నేతకాని, మాదిగ, బీసీ కులాల పట్ల చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకొని, డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని కులాలను కలుపుకొని, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షుడు గోలేటి లక్ష్మి, రాష్ట్ర యువజన అధ్యక్షుడు అనపర్తి యువరాజ్, ప్రధాన కార్యదర్శి దుర్గం సంతోష్, మండల నాయకులు దుర్గం రాజయ్య లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News