- తిప్పారపు శ్రీనివాస్, సిపిఎం మండల కార్యదర్శి
నేటి సాక్షి, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల, పోతారం గ్రామాల శివారులో నిర్మాణంలో ఉన్న ఇథనాల్ కంపెనీల అనుమతులను రద్దు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ రాష్ట్ర సెక్రటేరియట్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ హమ్మద్ నదీమ్ ఐఏఎస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇథనాల్ కంపెనీలు ప్రజల నివాసాలకు సమీపంలో నిర్మాణం కావడంతో, విడుదలయ్యే విష వాయువులు ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని, వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేసి త్రాగునీరు, సాగునీరు విష పూరితంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు. అదనంగా, పశువులు మరియు పంటలకు హాని కలిగే అవకాశం ఉందని,గతంలో కూడా గుగ్గిళ్ల గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణాల వల్ల ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు సంఘ ఎల్లయ్య పాల్గొన్నారు.





