Wednesday, March 18, 2026

సీ.పీ.ఐ ఆధ్వర్యంలో ఘనంగా కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య 4వ వర్ధంతి వేడుకలు

నేటిసాక్షి ప్రతినిధి వేములవాడ (కొక్కుల వంశి): కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య 4వ వర్ధంతి సభ వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్, ధోభీగాట్ల వద్ద గుమ్మి పుల్లయ్య స్మారక స్థూపం వద్ద సీ.పీ.ఐ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సభ వేములవాడ నియోజకవర్గ సీపీఐ పార్టీ ఇంచార్జి కడారి రాములు ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగిందని ఈసందర్బంగా సిపిఐ పార్టీ ఇంచార్జి కడారి రాములు మాట్లాడుతూ… కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య ఒక నిరుపేద బ్రాహ్మణ కులంలో పుట్టి పేదల కోసం రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అగ్రవర్ణ పేదల కోసం ఎన్నో సాయుధపోరాటాలు చేసారని కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారితో సైతం కలిసి పనిచేశారని గుమ్మి పుల్లయ్య స్వాతంత్ర సమరయోధుడు. వీరు సాయుద పోరాట వీరులని, తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పోరాటాలు చేశారని ఇలాంటి మహోన్నతవ్యక్తి వర్ధoతిని జరుపుకోవడం గర్వకారణం అని దున్నే వానికే భూమి చెందాలని బలంగా నమ్మిన వ్యక్తి గుమ్మి పుల్లయ్య అని అన్నారు. ఈకార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యాదర్శి గాజుల పోశెట్టి, గుమ్మి పుల్లయ్య కుమారుదు మధు మహేష్, సీపీఐ నాయకులు ఎల్ల దేవరాజు, కోరేపు క్రాంతి, విక్రమ్, గాజుల దుర్గయ్య, పెంట శ్రీను, కనకయ్య, మల్లేశం తదితర సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News