Thursday, March 19, 2026

రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు జరపాలి

  • రిజర్వేషన్ పై చట్టబద్ధత కల్పించాలి
  • లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పై (బిసి)యుద్ధం తప్పదు..
  • జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, పొనుగోటి రంగా

నేటి సాక్షి, మునగాల : బిసి రిజర్వేషన్లను పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు పొనుగోటి రంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలలో బిజీ రిజర్వేషన్లను 42 శాతం పెంచితేనే పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా బీసీలకు అవకాశం దక్కుతుందని. ఈ మేరకు రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. మునగాల మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో జరిగే జనగణన‌ లో బీసీ కులగణన చేర్చాలని బిసి రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే రాజకీయ అధికారమే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని బీసీ సంఘాలకు, మేధావులకు పిలుపునిచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రక్షించుకోవడానికి బిసి రిజర్వేషన్ల సంఖ్యను ప్రభుత్వం తగ్గించిందని ధ్వజమెత్తారు. 10 శాతం కంటే తక్కువగా ఉన్న ఓసీలను 15.79 శాతంగా ఎలా చూపారని ప్రశ్నించారు. బీసీల సంఖ్యను తక్కువగా చూపించి వారి రాజకీయ రిజర్వేషన్లను దెబ్బ తీసేందుకే ప్రభుత్వం కుట్ర పన్ను తుందని విమర్శించారు. తక్షణమే పూర్తి పారదర్శకతతో నిజమైన ఘనం కాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News