నేటి సాక్షి, మహబూబాద్, నరసింహుల పేట (భూక్య రవి) : గౌరవ మహబూబాబాద్ ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపీఎస్ గారి ఆదేశానుసారంగా మహబూబాబాద్ టౌన్ పిఎస్ పరిధిలోని నూకల రామచంద్ర రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబాబాద్ నందు షీ టీం, భరోసా, మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలపై కళాశాల మహిళా సాధికారిక విభాగం మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 తరపునఅవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్సై సునంద గారు మాట్లాడుతూ బాలికల భద్రత షీ టీం లక్ష్యం అని తెలిపారు. కళాశాలలో కానీ, బయట కానీ, ఎక్కడైనా ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురిచేసిన, వేధించి ఇబ్బంది కలిగించిన, లేదా ఇబ్బందికరంగా మాట్లాడిన, తమకు ఫిర్యాదు చేయాలని, విద్యార్థినిలు చిన్న విషయాలకు ఆవేదనలకు గురికాకూడదని, మంచి ఆలోచనలతో చదువుకోవాలని సూచించారు. మహిళలపై కానీ, విద్యార్థినిలపై కానీ వేధింపులు జరిగినట్లయితే మా షీ టీం వాట్సాప్ నెంబర్ 8712656935 నాకు సమాచారం అందించాలని తెలిపినారు. మొబైల్ ఫోన్లో నూతన పరిచయాల వలన చాలామంది మోసపోతున్నారని, తెలియని వ్యక్తుల నుండి వీడియో కాల్స్ ద్వారా ఇరకాటంలో పడుతున్నారని, చదువుకునే విద్యార్థినిలు ఇంస్టాగ్రామ్ ద్వారా చాటింగ్ చేస్తూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారని హెచ్చరించారు. మహిళలు విద్యార్థినిలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి బెదిరింపులకు భయపడవద్దని అవగాహన కల్పించారు. ప్రయాణాలలో మహిళలు మరియు విద్యార్థినిలు అందరూ తప్పనిసరిగా(T-SAFE) ట్రావెల్ షేప్ యాప్ ని ఉపయోగించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని, ఇట్టి యాప్ ని ఉపయోగించడం వలన ప్రయాణం సురక్షితంగా ఉంటుందని, ప్రయాణంలో పోలీసు సహాయం తప్పక ఉంటుందని వివరించారు. సమాజంలో మహిళలు మరియు బాలికలు తెలిసిన వారితోనే ఎక్కువ వేధింపులకు గురవుతున్నారని, అలాంటప్పుడు జాగ్రత్త పడాలి తప్ప అధైర్య పడవద్దు అని, వేధింపులకు పాల్పడిన వారి వివరాలతో షీ టీం ని సంప్రదించి ఫిర్యాదు చేస్తే అట్టి వారి ఆట కట్టించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఫిర్యాది వివరాలు గోప్యంగా ఉంచబడతాయని సూచించారు. తమ వ్యక్తిగత సమాచారం గానీ కుటుంబ సభ్యుల సమాచారం గానీ, సామాజిక మాధ్యమాలలో పెట్టకూడదని, వ్యక్తిగత ఫోటోలు డిపిలు పెట్టుకోవద్దు అని చెప్పారు. తమ వ్యక్తిగత సమాచారం బ్యాంకు వివరములు ఏటీఎం పిన్ నెంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయవద్దని సూచించారు మొబైల్ యాప్ లలో వచ్చినటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చేసి సైబర్ నేరాల బారిన పడకూడదని సూచించారు. ఒకవేళ సైబర్ నేరాల బారిన పడిన అధైర్య పడకుండా వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్1930 ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థినిలపై ఆకతాయిలో ఇబ్బందులకు గురి చేసిన అసాంఘిక చర్యలకు పాల్పడితే పోలీసు వ్యవస్థ చూస్తూ ఊరుకోదని అట్టి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా మైనర్లు డ్రైవింగ్ చేయకూడదని, రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించారు.
- ప్రయాణాలలో ఎలాంటి మద్యం కానీ మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడిపిన అల్లర్లకు పాల్పడిన లేదా మహిళలను లేదా బాలికలను గాని మద్యం మత్తులో ఇబ్బందులకు గురిచేసిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని సూచించారు.
- అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
- యాంటీ వుమెన్ ట్రాఫికింగ్ గురించి ఉమెన్ పీసీ సుప్రజ వివరించారు.
- భరోసా విధులు, మరియు పనితీరు ఫోక్సో చట్టాల గురించి మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల గురించి భరోసా సెంట్రల్ కోఆర్డినేటర్ జ్యోత్స్న మేడం వివరించారు. షీ టీం సిబ్బంది అరుణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువు చాలా ముఖ్యమని ,చదువుకునే సమయంలో చెడు ఆలోచనలకు తావివ్వకూడదని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దని, ప్రతి విద్యార్థిని విద్యార్థులు ధైర్యంగా ఉండాలని బాలికలను వేధింపులకు గురి చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసులు, ఐక్యూ ఏసి కోఆర్డినేటర్ జూపూడి అనిల్ కుమార్, అధ్యాపకులు డాక్టర్ వి సాంబశివరావు, బి శ్రీనివాస్, డి. రాజశేఖర్, డాక్టర్ బి. హాతిరామ్, డాక్టర్ ఖాసీంషా, యం.సుమన్, డాక్టర్ పి యుగేందర్, యం వీరు, డాక్టర్ కే సుమలత, డాక్టర్ పి , ప్రభావతి దేవి, వి నాగరాజు, ఓ ఉదయ్ కుమార్, యన్ నరేష్, సంతోష్ మరియు 200 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు





