Thursday, March 19, 2026

రాజన్న ఆలయంలో సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం

  • క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న రాజన్న ఆలయ ఈవో కె.వినోద్
  • ఆనందం వ్యక్తం చేస్తున్న స్వామి వారి భక్తులు

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తలనీలాలు సమర్పించుకొని సేవలో తరించారు. దీంతో సామాన్య భక్తులకు ధర్మదర్శనంలో లోటుపాట్లు ఇబ్బందులు లేకుండా ఈవో కె.వినోద్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సామాన్య భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా కృషి చేస్తున్న ఈవో కె. వినోద్ తీరుపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అధికారులకు,ఎస్పిఎఫ్ సిబ్బందికి ఈవో పలు సూచనలు చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News