- యువజన కాంగ్రెస్ గద్వాల తాలూకా జనరల్ సెక్రటరీ ధరూర్ రవి
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్ లో సోమవారం అఖిలపక్ష కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన మండలాల ఏర్పాటు కొరకు సన్నాహక సమావేశంలో భాగంగా గద్వాల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ధరూర్ రవి హాజరై మాట్లాడుతూ ధరూర్ మండల కేంద్రం మేజర్ గ్రామపంచాయతి అవకాశాలు వచ్చిన గతంలో కొంతమంది పాలకుల నిర్లక్ష్య వైఖరితో గుర్తింపు రాలేదని, ఇప్పటికైన గద్వాల నియోజకవర్గంలో ఇంకా రెండు మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని అందుకు గాను పరిపాలన సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ధరూర్ మున్సిపాలిటీ చేసేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు గలవని, ఇట్టి అంశంపై స్థానిక వివిధ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు, నిరుద్యోగ యువకులు, మేధావులు, రైతులు,ప్రజా కార్మిక సంఘాల నాయకులు ముందుకు వచ్చి మున్సిపాలిటీ సాధనలో భాగస్వామ్యం కావాలని ధరూర్ రవి అఖిలపక్ష సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, సీనియర్ సిటిజన్ ఫోరం మోహన్ రావు,ప్రభాకర్, అచ్చన్న గౌడ్, ఆంజనేయులు, అతికూర్ రహమాన్, పూడూరు ఈశ్వర్, చిన్నపాడు ఆంజనేయులు, ఎల్కూర్ తిమ్మప్ప, జంగం శేఖరయ్య,రాఘవేంద్ర,గోపాల్ రావు,టవర్ మక్బూల్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.





