- 25 ఏళ్లుగా పట్టించుకోని అధికారులు
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల్ నియోజకవర్గంలోని కేటి దొడ్డి మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది.వివరాల్లోకి వెళ్తే : కొండాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో ప్రతి వార్డులో డ్రైనేజీ లేక పారే మురికి నీటిలో దోమలకు ఈగలకు ఆవాసాలు మారి దుర్వాశంతో ప్రజలు రోగాలు బారిన పడే అవకాశం నెలకొన్నది 9 వార్డులో అయితే మరి ఘోరాతి ఘోరంగా డ్రైనేజీ సిసి రోడ్డు లేక తిప్పలు తప్పడం లేదు ఉన్నత అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు అందజేసిన ప్రయోజనం లేకపాయ కొండాపురం గ్రామ సెక్రెటరీ శంషాద్ బేగం కు వినతి పత్రం ఇచ్చిన ప్రయోజనం లేకపాయ ప్రజలు డ్రైనేజీ సమస్యలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మురికి నీళ్ళు రోడ్డుపైన ఏర్లై పారిన పట్టించుకోని అధికారులు కాలినడకతో ఆ మురికి నీటిలో చిన్నలు పెద్దలు నడవక తప్పడం లేదూఎవరు తాగి వచ్చి ఆ మురికి నీటిలో పడి చస్తారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. గ్రామ సెక్రెటరీ గ్రామంలో తిరిగి సమస్యలు పరిష్కరిస్తే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా గా ఉంటాయి. ఉన్నతాధికారులు వీటిని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ కాలనీలో మరియు వార్డు లో చాలా సమస్యలు ఉన్నాయి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించాలని గ్రామ సెక్రెటరీ నీ కోరుతున్నా కొండాపురం ఎస్సీ కాలనీ వాసులు, ఇప్పుడు కూడా చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం.





