- రోడ్డుపై పారుతున్న పట్టించుకోవట్లే

నేటిసాక్షి, రాయికల్ : రోడ్డుపై పారుతున్న ఈ నీరు వర్షం నీరు కాదు. మురకినీరే రాయికల్ మండలం మూటపెల్లి, కొత్తపేట ప్రధాన రహదారిపై ఇలా మురికినీరు పారుతున్న పంచాయతీ సిబ్బంది, అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇంటిపన్ను కడితేనే డ్రైనేజీలో ఉన్న చెత్తను తొలగిస్తామని పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నరు. మండలస్థాయి అధికారులు స్పందించి డ్రైనేజీలో ఉన్న చెత్తను తొలగించి మురికినీరు రోడ్డుపై రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చెత్త తొలగించకపోవడంతో రోడ్డుపై పారుతున్న మురికినీరు దృశ్యాలు





