- ప్రగతిలో ఘనంగా 40 ఏళ్ల వేడుకలు


నేటిసాక్షి, రాయికల్ : రాయికల్పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాల 40 వ వార్షికోత్సవ వేడుకలు”ప్రగతి విజయయానం” అనే పేరుతో ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాలే శేఖర్ మాట్లాడుతూ తమ పాఠశాల ప్రారంభించి 40 ఏళ్లుపూర్తయ్యాయని తెలిపారు. ఈ కాలంలో విద్యారంగ చరిత్రలో ఎందరో విద్యార్థులను గొప్పవారీగా తీర్చీదిద్దిన ఘనత తమకే దక్కిందని, ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని, చదువుపై మక్కువను ఏర్పర్చుకోవాలని సూచించారు. ఆనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఊరు పల్లెటూరు, జానపద పాటలు, దేవుళ్ల పాట ఆహుతలను అలరింపజేసాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బాలె జయశ్రీ, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం, పోషకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





