Thursday, March 19, 2026

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న టిఫిన్ సెంటర్లు

  • కమల్ టిఫిన్ సెంటర్ లో చట్నీలో బొద్దింక
  • టిఫిన్ తిని అస్వస్థతకు గురైన యువకుడు

నేటి సాక్షి, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కమల్ టిఫిన్ సెంటర్ లో చట్నీ లో బొద్దింక. యువకుడు తెలిపిన వివరాల ప్రకారం అతడు ఆదివారం రోజున ఉదయం జమ్మికుంట నుండి మహారాష్ట్ర కు వెళ్ళే క్రమంలో రైలు ఆలస్యంగా రావడంతో టిఫిన్ చేద్దామని గాంధీ చౌరస్తాలోని కమల్ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేయడానికి వెళ్ళగా బజ్జీలను ఆర్డర్ చేసి తింటున్న క్రమంలో చట్నీలో బొద్దింక రావడంతో ఆ యువకుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఇదేంటని హోటల్ సిబ్బందిని నిలదీయగా నువ్వే కావాలని అందులో వేసుకున్నావని నాతో వాగ్వాదానికి దిగారు అని, నేనెలా వేస్తాను అని చట్నీలోనే వచ్చిందని ఆ యువకుడు హోటల్ సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలోనే ట్రైన్ రావడం గమనించిన యువకుడు తినే టిఫిన్ అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. రైల్లో వెళ్తున్న క్రమంలో కడుపులో వికారంగా ఉండటంతో రెండుసార్లు వాంతులు జరిగాయని, సోమవారం రోజున వాంతులతో పాటు విరోచనాలు కూడా అయ్యాయని, వాంతులు విరోచనాలతో అస్వస్థకు గురయ్యానని పట్టణంలోని వారి బంధువుకు తెలపడం జరిగింది. విషయం తెలుసుకున్న వారి బంధువు హోటల్ యజమానితో మాట్లాడే ప్రయత్నం చేశాడు కానీ వారు ఆ బందువును కూడా అతనిదే తప్పు అతనే బొద్దింక కావాలనే వేశాడు అని వెంటనే మాట మార్చి బయటనుండి రావచ్చు కాదా అని తెలిపారు.అతని బందువు కి వారి తప్పు లెనట్టుగానే వ్యవహరించారని, తప్పు కప్పిపుచ్చుకోవాడనికి ప్రయత్నం చేశారని, ఈ క్రమమంలో అతని బంధువు అక్కడే ఉన్న చెత్త డబ్బా పక్కన మిరప బజ్జీలు వేసే మిరపకాయలు ఉండడం గమనించి ఇదేంటని అడగగా అక్కడి నుంచి వాటిని తీసేసి ఆప్పటికప్పుడు అక్కడ శుభ్రం చేసే ప్రయత్నం చేశారు. కాగా హోటల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకు దగ్గర్లో గ్యాస్ సిలిండర్లను పెట్టడం, హోటల్ గోడలకు పాచి పట్టి ఉండడం పరిశుభ్రంగా లేకపోవడం గమనించారు. అంతేకాక ప్రతీది వారికి నచ్చినట్టుగా చేయడం గమనించిన అతని బంధువు ఇలాంటి హోటల్ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు తనిఖీలు నిర్వహించట్లేదని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి నాణ్యతలేని హోటళ్లపైన వెంటనే తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ బంధువు డిమాండ్ చేశారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News