Thursday, March 19, 2026

ఇల్లు కాలిపోయిన కుటుంబానికి సహాయం

నేటిసాక్షి, మంగపేట : మండలంలో తిమ్మంపేట గ్రామంలో నేతకాని కాలనీలో గాందేర్ల సమ్మక్క ఇల్లు సోమవారం అగ్ని ప్రమాదానికి గురై ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది.విషయం తెలుసుకున్న శ్రీ లక్ష్మి నరసింహ దత్త సేన సేవ ట్రస్ట్ చైర్మన్ ఏడు నూతుల ఈశ్వర్ చంద్ శర్మ నాలుగు వెల రుపాయలు సహాయం చేశారు అలాగే నేతకాని కుల సంఘం నాయకులు మంగళవారం గ్రామ కమిటీ అధ్యక్షులు దుర్గం బిక్షపతి ఆధ్వర్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి అన్ని రకాలుగా అండగా ఉంటామని, వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. సమ్మక్క కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని నేతకాని కుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నేతకాని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డిగొండ కాంతారావు,జిల్లా ప్రధాన కార్యదర్శి జాడి రాంబాబు,జిల్లా ఉపాధ్యక్షులు పూసల నరసింహారావు,యువజన విభాగం మండల అధ్యక్షులు రామటంకి సందీప్,జిల్లా సోషల్ మీడియా విభాగం బసారికరి నాగార్జున,మండల నాయకులు దుర్గం శివప్రసాద్,దుర్గం సతీష్,గోమాసు లక్ష్మీనారాయణ, గాంధార్ల సంతోష్  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News