- కెఎల్ఆర్
- త్వరలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో కేఎల్ఆర్ మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ ఆశావాహులు తమ పేర్లను తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో అందించాలని మహేశ్వరం, కందుకూరు మండలాల నాయకులకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కోరారు. విదేశీ పర్యటనలో ఉన్న కేఎల్ఆర్ త్వరలో రానున్న ఎన్నికల నోటిఫికేషన్ కు సిద్ధం ఉండాలని మండల నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇన్ఛార్జులుగా గ్రామాలకు వెళ్లాలి అనుకునే నాయకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు లక్ష్మారెడ్డి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఎక్కువ సీట్లు కేటాయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని గుర్తు చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏది ముందొచ్చినా సిద్ధంగా ఉండాలని బూత్ లెవల్ లో నాయకులు పని చేయాలని కేఎల్ఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా సోషల్ మీడియా సహా ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని కిచ్చెన్న వారియర్స్ కు సూచించారు.





