- బీఆర్ఎస్పార్టీ నాయకుడిని పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని ఉట్లపల్లి గ్రామంలోపార్టీ నాయకులు మహేష్ తండ్రి కీర్తిశేషులు లక్ష్మయ్య మరణవార్త తెలుసుకున్న మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఉట్లపల్లి గ్రామం చేరుకొని లక్ష్మయ్య పార్దవ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





