నేటి సాక్షి, మెట్ పల్లి : పట్టణంలోని బోయవాడలో నేడు లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ముప్పైయవ వార్షికోత్సవం పురస్కరించుకొని కళ్యాణ బ్రహ్మోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభం జరగనున్నాయి. బుధవారం ఉదయము సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము, సత్యనారాయణ స్వామి కథలు ప్రత్యేక అభిషేకము జరగనున్నట్లు తెలిపారు. పట్టణ గ్రామీణ ప్రజలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు.





