నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) : గోదావరిఖని పట్టణం యందు గంగానగర్ నివాసి అయిన మడిపల్లి ఉదయ్ సన్నాఫ్ కొమురయ్య 30 సంవత్సరాలు సింగరేణి ఉద్యోగి 2022 సంవత్సరంలో అనూష అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది . వీరిద్దరూ 8 నెలల పాటు వీరి ఫ్యామిలీ జీవితాన్ని కొనసాగించిన తర్వాత మనసు పడదలొచ్చి అనూష వాళ్ళ తల్లిగారిలైన జీఎం కాలనీకి వెళ్ళినది వీరికి ఒక బాబు 18 నెలలు. వేధింపులు భరించలేక అనూష గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు 498 కేసు పెట్టడంతో ఉదయ్ కుమార్ ను ఫోటో పంపడం జరిగింది. అట్టి భార్యాభర్తల మధ్య కేసు నడుస్తున్న క్రమంలో తేదీ 9.2.2025 రోజున సాయంత్రం ఉదయ్ తన బైక్ తీసుకొని జిఎం కాలనీలోని తన భార్య తల్లిగారిల్లు ఇంటికి వెళ్లి తన భార్య పైన 18 నెలల తన కొడుకు పైన బైకుతో గుద్ది హత్యాయత్నం ప్రయత్నం చేసినాడు చుట్టుపక్కల వాళ్ళు అడ్డుకోవడంతో తప్పించుకొని పారిపోయినాడు. అనూష ఇచ్చిన దరఖాస్తు మేరకు ఉదయ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారించి ఈరోజు తేదీ 11/2/2025 రోజున 11:30 గంటలకు అరెస్టు చేయడం జరిగింది అతడి దగ్గర నుంచి ఒక కారు బైకును సీజ్ చేయడం జరిగింది.





