- కొత్త గోల్ తండా లో ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్
- ఒకవైపు ప్రాథమిక పాఠశాల, మరోవైపు ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్
- రచన కంచ ఏర్పాటు చేయాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన


నేటి సాక్షి, కోదాడ (అనంతగిరి): సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని కొత్త గోల్ తండా గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు రక్షణ కంచే లేక ప్రమాదకరంగా మారింది.విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అంగన్వాడి అదేవిధంగా పాఠశాలలో చదువుకునే చిన్న పిల్లలు తెలిసి తెలియని వయసులో ఆటలాడుతూ అటువైపుగా వెళితే ప్రాణాపాయం పొంచి ఉంటుందని భయందోళనకు గురవుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప పట్టించుకోరా అని ప్రజలు అంటున్నారు.ఏ నిమిషంలో అయినా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నపటికీ విద్యుత్ శాఖ అధికారుల పట్టనట్టు ఉండడం పై ప్రజలు మండిపడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ట్రాన్సపార్మర్ కు కంచెను ఏర్పాటు చెయ్యాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.





