Thursday, March 19, 2026

ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిరం

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీంరాజ్ పల్లి గ్రామంలో మంగళవారం ఉచిత గుండె,కంటి వ్యాధుల నిర్దారణ శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామంలో గ్రామపంచాయితి కార్యాలయంలో రెవెల్ల సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు నేత్రవైద్య నిపుణులు పూదరి దత్తాగౌడ్ సహకారంతో ఫార్చూన్ మెడ్ కేర్ శరత్ మ్యాక్సీ విజన్ కరీంనగర్ ఆసుపత్రుల సౌజన్యం తో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 223 మంది గ్రామస్తులకు షుగర్,బీపి,ఇసిజి 2డి ఎకో కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మెడ్ కేర్ హాస్పిటల్ క్యాంప్ ఇంచార్జ్ గజవెల్లి గణేష్, మాజీ సర్పంచ్ రెవెల్ల లింగయ్య గౌడ్ , కంది వెంకటేశం, రెవెల్ల సాగర్, నాని గౌడ్,తక్కల గజేందర్, కులగాని తిరుపతి, వేణు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News