Thursday, March 19, 2026

విపత్తుల సమయంలో ఆపద మిత్ర వాలంటీర్లు ఉత్తమ సేవలను అందించాలి

  • జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆపద మిత్ర వాలంటీర్లు అత్యుత్తమ సేవలను అందించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని సంస్కృతి విహార్ లోనే శిక్షణ కేంద్రంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆపద మిత్ర వాలంటీర్లకు 12 రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆపదమిత్ర వాలంటీర్లు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఇతర శాఖల సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. విపత్తుల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాల నుండి కాపాడటంలో ఆపద మిత్ర వాలంటీర్లు సేవలందించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా ఆపదలో ఉన్న వారిని ఏ విధంగా రక్షించ వచ్చనే మెలకువలను ఆపద మిత్ర వాలంటీర్లు శిక్షణలో తెలుసుకోవాలని సూచించారు. హన్మకొండ జిల్లా ఫైర్ అధికారి కొండం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్లు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మేము చెప్పే మెళుకువలు నేర్చుకొని ఆపద కాల సమయం లో వారిని రక్షించు కోవడానికి మరియు పక్కవారిని కూడా రక్షించుకోవడానికి, పనికి వస్తాయని అంతే కాకుండా సమాజ సేవ చేసిన వారమౌతాం తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఫైర్ అధికారి కె వెంకట సతీష్ కుమార్, హాసన్ పర్తి తహసిల్దార్ చల్ల ప్రసాద్, సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News