Thursday, March 19, 2026

విద్యుత్ షాక్ తో తల్లి, కొడుకు మృతి

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి, భక్త కుమార్ : డి కోడూరు మండలంలోని గుంతపల్లి గ్రామానికి చెందిన కూరాకు జయరాం రెడ్డి (48) గురమ్మ (60) విద్యుత్ షాక్ తో మృతి. గుంతపల్లి గ్రామ సమీపాన ఉన్న తెలుగు గంగకాలువలో మోటర్ పెట్టి పొలానికి నిరంధిస్తున్నారు. మోటరు ఆడకపోవటంతో చిన్నపాటి మరమ్మత్తులు చేస్తున్న సమయంలో జయరాం రెడ్డికి విద్యుత్ షాక్ తో గిలగిలా కొట్టుకుంటుండగా తల్లి గురమ్మ గమనించి కొడుకులు పట్టుకోవటంతో ఆమె కూడా విద్యుత్ షాకు గురై చనిపోయింది. వీరి ఇరువురు చనిపోవడంతో గుంతపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.బి కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News