- ఎస్సై ని సస్పెండ్ చేయాలి!!
నేటి సాక్షిఅన్నమయ్య జిల్లా ప్రతినిధి, భక్త కుమార్ : భార్యాభర్తల మధ్య గొడవ 100 డయల్ కు ఫిర్యాదు చేసిన భార్య మాధురి.భార్యా భర్తల మధ్య గొడవను సర్ది చెప్పాల్సిన పోలీసులు లాఠీ విరిగేదాకా భర్త శివప్రసాద్ ను చితకబాదిన వైనంపై సిఐటియు జిల్లా అధ్యక్షులు, సిహెచ్ చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. అర్ధరాత్రి సమయంలో బొమ్మతొట్టి శివప్రసాద్ ను కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.లాఠీ విరగడంతో డ్రిప్పు పైపుతో ఇష్టారాజ్యంగా దాడి చేసిన పోలీసులు. ఒళ్లంతా కందిపోయి రక్త గాయాలతో మీడియా ముందు కన్నీటి పర్యంతమైన శివప్రసాద్. తనకు ఆపరేషన్ జరిగిందని ముఖంలో ప్లేట్లు, కాళ్లలో,రాడ్లువేసారనికాళ్లుపట్టిబతిమిలాడుకున్నా వదలకుండా ముఖంపై బూటు కాలుతో పోలీసులు తన్నారని బాధితుడు ఆవేదన వ్యకం చేసిన శివప్రసాద్. దీనిపైన సమగ్ర విచారణ జరపాలని, తక్షణం, ఎస్సైని, బాధ్యులైన పోలీసులపై, సస్పెండ్ చేయాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్యమా, లేక పోలీస్ రాజ్యమా, చట్టాల పైన కోర్టులు పైన పోలీసులకు గౌరవం లేదా అని ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు, ఇంత దుర్మార్గంగా విచక్షణారకంగా లాఠీలతో, మనిషి చచ్చే వరకు, బాధడం దుర్మార్గమన్నారు.





