Thursday, March 19, 2026

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కలసిన జనక్ ప్రసాద్

నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మల్లు భట్టివిక్రమార్క సింగరేణి సి.ఎండి. బలరాం నాయక్ ఐ.ఆర్.ఎస్ మర్యాద పూర్వకంగా కలిసి పలు విషయాల పై చర్చించిన తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ ఐ. ఎన్.టి. సి సిసెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్. హైదరాబాద్ లోని తెలంగాణ ప్రజా భవన్ యందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి సి.ఎం.డి. బలరాం నాయక్ ఐ.ఆర్.ఎస్.కలిసి సింగరేణి గురించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో జైపూర్ లో దాదాపు 8000 కోట్ల పెట్టుబడితో 800 మెగా వాట్ల ప్లాంట్ విస్తరణ కి కృషి చేసినందుకు గాను ధన్యవాదాలు తెలుపుతూ. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చిన తర్వాత సింగరేణి లో కార్మిక సంక్షేమం. సంస్థ అభివృద్ధి కోసం చేసిన అనేక కార్యక్రమాల పై చర్చించారు. అలాగే సంస్థ అభివృద్ధి కోసం సమర్ధవంతమైన నాయకత్వం ఉన్న సీఎండీ బలరాం నాయక్. పదవి కాలం పొడగింపు సమర్థవంతమైన ఇద్దరు డైరెక్టర్ల నియామకం వంటి అంశాలపై హర్షం వ్యక్తం చేస్తూ సింగరేణి లో రాబోయే కాలంలో కార్మికుల సంక్షేమం సంస్థ మనుగడ కోసం 1000 మెగా వాట్ల హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News