- అదనపు కలెక్టర్
నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) : ఒప్పందంలో పేర్కొన్న గడువులోపు పురోగతిలో ఉన్న అన్ని అభివృద్ది పనులు పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశించారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మంగళ వారం సాయంత్రం ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ లతో సమావేశం నిర్వహించి అభివృద్ది పనుల పురోగతిని సమీక్షించారు. సంధర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బిల్లులు రికార్డ్ చేయడంలో ఉద్దేశ్య పూర్వకంగా జాప్యం చేసి కాంట్రాక్టర్లను అధికారులు , సిబ్బంది ఇబ్బంది పెట్టినట్లయితే ప్రత్యేకాధికారి గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ కు లేదా తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని అన్నారు. పూర్తయిన పనికి సంబందించి రికార్డులు సాధ్యమైనంత త్వరగా నమోదు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా, నిర్ణీతగడువులోగా పూర్తి చేయకపోయినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు సదరు కాంట్రాక్టర్ల పేర్లను బ్లాక్ లిస్ట్ లో చేర్చడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత కొత్త పనులను ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో నగర పాలక సంస్థ ఎస్ ఇ శివానంద్, ఇ ఇ రామన్ తదితర ఇంజనీరింగ్ అధికారులతో పాటు పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.





