Thursday, March 19, 2026

ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసిన, డంపింగ్ చేసిన కఠిన చర్యలు

  • జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగుళాంబ గద్వాల్ జిల్లా జిల్లా పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు, విక్రయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా ఇసుకను తరలించడం, అక్రమంగా నిల్వ చేయడం వంటి కార్యకలాపాలను నిరోధించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక దాడులు నిర్వహిస్తోందనీ, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దాడులు చేసి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పి తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ (PDPP) చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టం (Mines and Minerals Act) ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి ప్రభుత్వ అనుమతులున్న వారికి మాత్రమే ఇసుక రవాణా చేయడానికి, విక్రయించేందుకు హక్కు ఉందని, ఇతరులెవరైనా ఇసుక రవాణాకు పాల్పడితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా గురించి ప్రజలు సమాచారం అందించాలని, డయల్ – లేదా సంబంధిత పోలీస్ వారికి సమాచారం అందించాలని మరియు సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇసుక అక్రమ రవాణా అక్రమ డంపింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, అక్రమ రవాణా అక్రమ డంపింగ్ చేసే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News